సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు. కలియుగం చివరలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడని.. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి కల్కిలా ఉద్భవిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక సైన్స్ ఫిక్షన్‌గా ప్రభాస్ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ వీడియోను చూస్తే తెలుస్తోంది..
కలియుగపు చీకటి రోజుల్లో ఓ దుష్టశక్తి ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. దేవుళ్లను కూడా అంతం చేస్తానని ప్రతినబూనుతుంది. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలని ఆజ్ఞాపిస్తుంది. ఆ దుష్టశక్తిని, దాని అనుచరగణాన్ని అంతమొందించడానికి ఓ వీరుడు ఉద్భవిస్తాడు’ అని చెప్పేలా ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ సాగింది. ఈ వీడియో మొత్తం 75 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్‌లో కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉంది. వాటీజ్ ప్రాజెక్ట్ కే అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
ఇందులోని యాక్షన్స్ సీన్స్, విజువల్స్ అందర్నీ కట్టిపడేసేలా ఉన్నాయి. సంతోశ్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న గ్లింప్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చేస్తున్నాయి.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమాలో డార్లింగ్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని వీడియోకు వస్తున్న కామెంట్స్ తో తెలిసిపోతుంది.. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదికి సంక్రాంతికి విడుదల కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-K (కల్కి-2898 AD) గ్లింప్స్ విడుదల కోసం అమెరికా శాన్తియాగో వెళ్లిన చిత్ర యూనిట్ అక్కడి అభిమానులు వినూత్నంగా స్వాగతం పలికారు. ప్రభాస్ కు వెల్కం చెబుతున్న పోస్టర్ను ఓ జెట్ విమానం వెనక కట్టి ఆకాశంలో ప్రదర్శించారు. దీన్ని అక్కడి ఇండియన్స్తో పాటు స్థానికులు కూడా ఆసక్తిగా తిలకిస్తూ తమ కెమెరాల్లో బంధించారు.. ఆ వీడియో కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది..