Site icon NTV Telugu

Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందని నితీష్ కుమార్ ఈరోజు అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతతో పార్టీ ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ముందే ఊహించారా అని అడిగిన ప్రశ్నపై.. కచ్చితంగా అంటూ నితీశ్‌కుమార్ స్పందించారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు చేతులు కలిపాయని ఇండియా కూటమి రూపకర్తలలో ఒకరైన నితీశ్‌ అన్నారు. మణిపూర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన నితీష్ కుమార్.. ఈ అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా ప్రతిపక్షం తన పని చేసిందని అన్నారు. చర్చకు వచ్చిన మొదటి రెండు రోజులూ పార్లమెంట్‌కు గైర్హాజరు కావడంపై ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన మండిపడ్డారు. ప్రజల్లో ఆరా తీస్తే బీజేపీ ప్రచారాలపై మాత్రమే దృష్టి పెడుతుందని వారు అంగీకరిస్తారన్నారు. మీకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయా అని మీడియా ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు.

Also Read: Russia-Ukraine War: మాస్కోలో విమానాల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే?

నితీష్ కుమార్ గతేడాది బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలిపి బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం నిన్నటితో ఏడాది పూర్తి చేసుకుంది. బీహార్ బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలోని మహాఘటబంధన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఒక రోజు తర్వాత.. ముఖ్యమంత్రి క్రచ్ రాజకీయాలు ముగుస్తున్నాయని నితీశ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నితీశ్ చెడు పాలనకు చిహ్నంగా మారాడు అని చౌదరి అన్నారు.

Exit mobile version