Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందని నితీష్ కుమార్ ఈరోజు అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతతో పార్టీ ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ముందే ఊహించారా అని అడిగిన ప్రశ్నపై.. కచ్చితంగా అంటూ నితీశ్‌కుమార్ స్పందించారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు చేతులు కలిపాయని ఇండియా కూటమి రూపకర్తలలో ఒకరైన నితీశ్ అన్నారు. మణిపూర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన నితీష్ కుమార్.. ఈ అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా ప్రతిపక్షం తన పని చేసిందని అన్నారు. చర్చకు వచ్చిన మొదటి రెండు రోజులూ పార్లమెంట్‌కు గైర్హాజరు కావడంపై ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన మండిపడ్డారు. ప్రజల్లో ఆరా తీస్తే బీజేపీ ప్రచారాలపై మాత్రమే దృష్టి పెడుతుందని వారు అంగీకరిస్తారన్నారు. మీకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయా అని మీడియా ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
Also Read: Russia-Ukraine War: మాస్కోలో విమానాల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే?
నితీష్ కుమార్ గతేడాది బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలిపి బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం నిన్నటితో ఏడాది పూర్తి చేసుకుంది. బీహార్ బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలోని మహాఘటబంధన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఒక రోజు తర్వాత.. ముఖ్యమంత్రి క్రచ్ రాజకీయాలు ముగుస్తున్నాయని నితీశ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నితీశ్ చెడు పాలనకు చిహ్నంగా మారాడు అని చౌదరి అన్నారు.
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..