ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడారు. కొత్త సీఎంపై10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ తమకు సమిష్టి నాయకత్వం ఉందని చెప్పారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులో ఎవరైనా సీఎంగా మారవచ్చాన్నారు. ఇతర పార్టీలలో బీజేపీలాగా సామాన్యులకు అవకాశాలు ఉండవన్నారు. తాము ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుంటామని తెలిపారు. చివరికి అది మా పార్లమెంటరీ బోర్డుకు వెళుతుందని.. అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కాబట్టి.. ఓ మంచి నాయకుడే ఎమ్మెల్యే అవుతారన్నారు.
READ MORE: Anil Ravipudi : సంక్రాంతికి ఈసారి చిరంజీవితో వస్తున్నారు!
ఇదిలా ఉండగా.. అంతకుముందు బీజేపీ నాయకుడు పర్వేశ్ వర్మ గెలుపు అనంతరం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్దకు వెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత.. చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. తాను నడ్డా ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నించగా.. కేంద్ర కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంద్నారు. ప్రస్తుతానికి ఢిల్లీలో వచ్చిన ఈ మార్పుకు క్రెడిట్ మోడీకే చెందుతుందన్నారు.
READ MORE: Anshu: అన్షు ‘అంబానీ’ కాదా? ఇలా షాక్ ఇచ్చిందేంటి?