ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడారు. కొత్త సీఎంపై10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ తమకు సమిష్టి నాయకత్వం ఉందని చెప్పారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులో ఎవరైనా సీఎంగా మారవచ్చాన్నారు. ఇతర పార్టీలలో బీజేపీలాగా సామాన్యులకు అవకాశాలు ఉండవన్నారు.