కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారింది. ఇటీవల పలు సందర్భాల్లో శశి థరూర్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై కఠినంగా మాట్లాడారు. దీనికి తోడు కేరళలో సీపీఎం ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానంపై ప్రశంసలు కురిపించారు. గతంలో, పార్టీ తనను పట్టించుకోకుంటే, తనకు వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో త్వరలోనే థరూర్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. Read Also: Deputy CM Pawan Kalyan:…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడారు. కొత్త సీఎంపై10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ తమకు సమిష్టి నాయకత్వం ఉందని చెప్పారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులో ఎవరైనా సీఎంగా మారవచ్చాన్నారు. ఇతర పార్టీలలో బీజేపీలాగా సామాన్యులకు అవకాశాలు ఉండవన్నారు.