NV Subhash: కనుమరుగైన నేతలకు పునరావాస కేంద్రం ‘బీఆర్ఎస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశరాజకీయాల్లో తాము క్రియాశీలక పాత్ర పోషిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రసంగంపై మండిపడుతోంది బీజేపీ. దేశ రాజకీయాలంటూ కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… ప్రజలు పట్టించుకోరని అన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. తెలంగాణలోనే ఏమీ చేయని వ్యక్తి ఇక జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. ‘టీఆర్ఎస్’ ను ఎప్పుడైతే… ‘బీఆర్ఎస్’ అని ప్రకటించారో… అప్పుడే తెలంగాణ అస్తిత్వం చచ్చిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ ఎక్కడ ఉన్నా.. దోచుకోవడం, దాచుకోవడం తప్ప, ప్రజలకు ఉపయోగమేమీ ఉండదని పేర్కొన్నారు. కేవలం తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే ‘బీఆర్ఎస్’ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
Read Also: Raj Kahani: అమ్మ ప్రేమ… అమ్మాయి ప్రేమ నేపథ్యంలో చిత్రం!
Also Read
- Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
‘బీఆర్ఎస్’ పార్టీ, దేశంలోని అవుట్‌డేటెడ్ పార్టీలు, కనుమరుగైన రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారుతుందే తప్ప, ఆ పార్టీ పీకేది ఏమీ లేదని వెల్లడించారు. ఎంతసేపు ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ అండ్ బ్యాచ్ కు … గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమై ఉంటుందని… ఇప్పటికీ అర్థం కాకుంటే టిఆర్ఎస్ నేతలు, కళ్ళుండి చూడలేని కబోదులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఎన్వి సుభాష్ వెల్లడించారు. గుజరాత్ లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కేసీఆర్ సహా ప్రత్యర్ధులు డబ్బు సంచులను పంపినా… రికార్డ్ విక్టరీ తో అక్కడి ప్రజలు బిజెపిని గెలిపించి, వీళ్ళ చెంప చెల్లు మనిపించారని అన్నారు.
Read Also: Shocking Video: వేరే వ్యక్తితో మాట్లాడుతుండగా రైల్వే టీసీపై తెగిపడిన కరెంట్ వైర్
ఇప్పటికైనా ఈ దొంగల ముఠాకు బుద్ధి వచ్చి, తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. దేశం కోసం, ధర్మం కోసం రోజులో 18 గంటలు పనిచేస్తున్న ప్రధాని మోదీ మేనియా ముందు, మీ పప్పులు ఉడకవని, ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కేసీఆర్ అండ్ బ్యాచ్ ను హెచ్చరించారు ఎన్వి సుభాష్. మీరు ‘టీఆర్ఎస్’ ను ‘బీఆర్ఎస్’ చేసుకున్నా… ఏమి చేసుకున్నా… మీకు ‘వీఆర్ఎస్’ తప్పదని… లిక్కర్ స్కామ్‌లలో, అవినీతి కేసులలో… మీరు జైలుకు పోక తప్పదని జోష్యం చెప్పారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్.
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!