BJP Candidate List: ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ నేడు (గురువారం) తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లో కుందార్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ నుంచి సురేంద్ర దిలర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కటేహరి నుంచి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుంచి బీజేపీ నుంచి ఏకైక మహిళా అభ్యర్థి సుచిష్మితా మౌర్య ఉన్నారు. రాజస్థాన్లోని చోరాసి (ఎస్టీ) స్థానం నుంచి బీజేపీ కరిలాల్ ననోమాను బరిలోకి దింపింది.
Read Also: Bandi Sanjay: మూసీ పేరుతో భారీ అవినీతి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్..
ఇకపోతే ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సిఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌తో పాటు సంజయ్ నిషాద్ కూడా ఢిల్లీలో క్యాంప్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశమై సీట్లపై చర్చ కూడా జరిగింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ వేయడానికి అక్టోబర్ 25 చివరి తేదీ. బుధవారం రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లను కేంద్ర సంస్థ ఢిల్లీకి పిలిపించింది. నిజానికి సీట్ల పంపకాల వ్యవహారం నిషాద్ పార్టీ, బీజేపీ మధ్య ఉంది. రాష్ట్రంలో ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 13న జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.