BJP Thanks Shahrukh: షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వపక్ష, విపక్ష పార్టీలకు విమర్శనాస్త్రంగా మారింది. బీజేపీ జవాన్ స్టోరీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని ఆరోపించింది. జవాన్ సినిమా కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన అవినీతి, అక్రమాలతో కూడిన పాలనను బహిర్గతం చేస్తుందంటూ సెటైర్లు వేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా జవాన్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘జవాన్ మూవీ 2004 నుంచి 2014 వరకు అవినీతి, విధాన పక్షవాతంతో నిండిన కాంగ్రెస్ పాలనను బహిర్గతం చేసింది. ఇందుకు మేము షారుఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ‘విషాద రాజకీయ గతాన్ని’ ప్రేక్షకులందరికీ జవాన్ చిత్రం గుర్తు చేస్తుందన్నారు.
Read Also:PM Modi: ఇండియా కూటమి “సనాతన ధర్మాన్ని” అంతం చేయాలనుకుంటోంది..
భాటియా పాత స్కాములన్నీ తవ్వి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అవినీతిమయంగా పేర్కొన్నారు. 2009 – 14 మధ్య యూపీఏ-II హయాంలో జరిగిన సీడబ్ల్యూజీ, 2జీ, బొగ్గు కుంభకోణాలను ఎత్తి చూపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ‘క్లీన్ రికార్డ్’ను నిర్వహించిందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదన్నారు. సినిమాలో షారుక్ ఖాన్ చెప్పినట్లుగా ‘మేము చిన్నవాళ్లం, మేము మా ప్రాణాలను దేశం కోసం పణంగా పెట్టగలం. కానీ దేశాన్ని అమ్మే మీలాంటి వారికి కాదు’ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కనీసం 1.6 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎన్‌డీఏ ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు చేసిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2.55 లక్షల కోట్లు జమ చేశామని ఆయన పేర్కొన్నారు.
Read Also:Jr NTR: సైమా స్టేజ్ పైన కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్…
గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని ఎగవేతదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రుణాలు ఇచ్చిందన్నారు. గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని పరారీలో ఉన్న స్నేహితుడు విజయ్ మాల్యాకు అప్పు ఇచ్చాడు. ఇందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. జవాన్ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ .. థాంక్స్ షారుక్ ఖాన్! ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ సమస్యలు ఇప్పుడు గత చరిత్రగా మారాయి. ఈ సినిమా యువ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది.