ఏపీలో బీజేపీ నేతలు మాటల దాడి పెంచుతున్నారు. అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏపీ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మాయమాటలతో మభ్యపెడుతోంది. మోసం, అబద్దాలు చెబుతున్నారు.అభివృద్ధి పక్కన పెట్టి రాజకీయాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులను మభ్య పెట్టడానికి క్యాబినెట్ సబ్ కమిటీ అంటున్నారు. ఉద్యోగస్తులను అమాయకులు అనుకోవడం ప్రభుత్వ పెద్దల అవగాహన రాహిత్యం అన్నారు. ప్రతిదీ ఎన్నికలకు లింక్ చేస్తూ ప్రభుత్వం పనిచేస్తోంది. నాలుగేళ్లు మాట్లాడకుండా ఎన్నికల వేళ గ్లోబల్ సమ్మిట్ పెట్టి రూ.లక్షల కోట్లు వస్తాయి అంటున్నారు.
Read Also:Pawan Kalyan:మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
ముఖ్యమంత్రి సహా ఎవరికీ అవగాహన లేదని అర్థం అవుతోంది. సమ్మిట్ లో ఒక్క విదేశీ పెట్టుబడిదారుడు లేడు. ఒక్క రూపాయి విదేశీ పెట్టుబడి రాలేదు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ముందస్తు ప్రణాళిక లేదన్నారు సత్యకుమార్. రాబోయే కాలంలో బీజేపీ పటిష్టానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అవసరం అయినప్పుడల్లా బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
Read Also: Kiran Abbavaram: అది రవితేజ సినిమా… ఇది రవితేజ ‘మీటర్’లో ఉండే సినిమా