వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఫిబ్రవరి నెలలో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ఏప్రిల్ నెలలో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. సమ్మర్ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాను థియేటర్ కి రండి అంటూ ‘మీటర్’ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వడానికి మీటర్ సినిమా సిద్ధమయ్యింది, ఈ మూవీ ప్రమోషన్స్ ని షురూ చేస్తూ మేకర్స్ ఇటివలే టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఏప్రిల్ 7నే రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రవితేజ కూడా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు కాబట్టి బాక్సాఫీస్ దగ్గర రావణాసుర సినిమాకి పాజిటివ్ ఎడ్జ్ దొరుకుతుంది. ఇలాంటి సమయంలో యంగ్ హీరో అయ్యుండి రవితేజతో కిరణ్ అబ్బవరం పోటీ పడడం అనేది రిస్క్.
Read Also: Sai Pallavi: ‘పుష్పరాజ్’ కోసం పది రోజులు కాల్ షీట్స్ ఇచ్చిన సాయి పల్లవి?
ఈ రిలీజ్ క్లాష్ గురించి మీటర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన కిరణ్ అబ్బవరం… “మా రవితేజతో పోటి ఎందుకు అని అందరూ అడుగుతున్నారు. ఆయన మా రవితేజ కాదండి మన రవితేజ. రావణాసుర రవితేజ నటించిన సినిమా, నాది రవితేజ ‘మీటర్’ లో ఉండే సినిమా. ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి సినిమాల్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో నా సినిమాలో కూడా అంతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రవితేజ సినిమా చూడండి, నా సినిమా కూడా చూడండి. అన్ని సినిమాలు చూసి ఆదరించండి” అంటూ సినీ అభిమానులకి విజ్ఞప్తి చేశాడు. మరి ఎవరు హీరో అనే విషయం చూడకుండా అన్ని సినిమాలని చూసి ఆదరించే ప్రేక్షకులు, ఏప్రిల్ 7న ఏ హీరోకి హిట్ ఇస్తారో చూడాలి.