Manoj : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైరవం మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తున్న సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన తండ్రి మోహన్ బాబు పెద్ద రాయుడు ఫొటో పక్కన భైరవంలోని తన గజపతి పాత్ర ఫొటోను ఎడిట్ చేసి పెట్టాడు.
Read Also : RCB-IPL Title: ఈసారి కప్పు ఆర్‌సీబీదే.. చరిత్ర ఇదే చెబుతోంది!
దీనికి ‘ఆయన కొడుకు వచ్చాడని చెప్పు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టు కాస్త క్షణాల్లోనే వైరల్ అవుతోంది. మనోజ్ కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను తమిళంలో హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా చేశారు. ఈ మూవీలో మూడు కీలక పాత్రల్లో రోహిత్, మనోజ్, సాయి శ్రీనివాస్ బాగా చేశారంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.
దాదాపు ఏడేళ్ల తర్వాత మనోజ్ నుంచి సినిమా రావడం.. అది కూడా మంచి టాక్ రావడంతో ఇది ఆయనకు కమ్ బ్యాక్ సినిమా అంటూ ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అప్పట్లో మోహన్ బాబు నటించిన పెద్ద రాయుడు తరహా పాత్రను ఇప్పుడు తాను చేశాను అనే విధంగా మనోజ్ పోస్టు ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Bhairavam Review : భైరవం రివ్యూ
Ayyana Koduku Vachadu ani chepu 💥🔥 pic.twitter.com/UMumguQqru
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 30, 2025