Delhi MLA’s : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్యలకు నిరసనగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సభకు ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు. రాజధానిలో దిగజారుతున్న వాయు కాలుష్యాన్ని నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. విజేందర్ గుప్తా, రాంవీర్ సింగ్ బిద్గురి, OP శర్మ, అభయ్ వర్మలు ఆక్సిజన్ సిలిండర్లు, మాస్క్‌లు ధరించి సమావేశానికి హాజరయ్యారు.
Read Also: Crime news : చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరుదైన వన్యప్రాణుల పట్టివేత
తొలిరోజు వాడీవేడీగా సభ సాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. సభ్యుల ఆందోలన మధ్య సభకు రెండుసార్లు అంతరాయం కలిగింది. చివరకు సభ రేపటికి వాయిదా పడింది. విషపూరిత గాలికి ప్రజలు చనిపోతున్నా సీఎం కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. కాగా, శీతాకాల సమావేశాలు మూడు రోజులే జరుగనున్నాయి. ఈ సెషన్‌లో ప్రశ్నోత్తరాలను తొలగించారు.
Read Also: Harassment : అత్తింట్లో దించుతానని అడవిలోకి తీసుకెళ్లి.. బాలికపై ముగ్గురు అఘాయిత్యం
శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌కు పంపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు ఎల్‌జీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యోగా తరగతులను రద్దు చేశారని, ఉపాధ్యాయులను శిక్షణకు ఫిన్‌లాండ్ పంపడంలో తాత్సారం చేశారని సీఎం కేజ్రీవాల్ ఎల్‌జీ సక్సేనాపై ఆరోపణలు చేశారు. అలాగే, మొహల్లా క్లినక్‌లతో తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో వాటిని నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్‌జీ రాజ్యాంగాన్ని ఏమాత్రం ఫాలో కావడం లేదని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎల్‌జీ కొట్టిపారేశారు. ఆప్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. ఆప్-బీజేపీ మధ్య ఆరోపణలు – ప్రత్యారోపణల మధ్య సభ వాయిదా పడింది.