Crime news : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరుదైన వన్య ప్రాణులను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ ప్రయాణీకుడి వద్ద ప్రాణం తో ఉన్న వన్య ప్రాణులు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. రెండు లగేజ్ బ్యాగ్ లలో 45 బాల్ ఫైతాన్స్, 3 అరుదైన జాతి కోతులు, 3 స్టార్ తాబేళ్ళు, 8 పాములను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణీకుడి పై వన్య ప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది కస్టమ్స్ బృందం. సీజ్ చేసిన వన్య ప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు పంపించారు కస్టమ్స్ అధికారులు.
Read Also:Harassment : అత్తింట్లో దించుతానని అడవిలోకి తీసుకెళ్లి.. బాలికపై ముగ్గురు అఘాయిత్యం
స్మగ్లింగ్ లకు అడ్డగా ఎయిర్ పోర్టులు మారాయి. మత్తు పదార్థాలు, బంగారం ఇప్పుడు వన్య ప్రాణులు ఇలా అన్నింటినీ అక్రమంగా రవాణా చేస్తున్నారు దుండగులు. ఎన్ని నిఘాలు ఏర్పాటు చేసిన ఈ స్మగ్లింగ్ ఆగట్లేదు. రోజుకో కొత్త మార్గంలో కేటుగాళ్లు పలు రకాల స్మగ్లింగ్ లకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల.. చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం, నగదు సీజ్ పట్టుబడింది. దుబాయ్, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద గుర్తించిన రూ. 37 లక్షల విలువైన బంగారం-విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. గతేడాది జూలై 14న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ హెరాయిన్ పట్టుబడింది. ఎంటెబ్బే నుండి వచ్చిన టాంజానియా జాతీయ ప్రయాణికుడి కడుపులో నుండి రూ. 8.86 కోట్ల విలువైన 1.266 కిలోల హెరాయిన్‌తో కూడిన 86 క్యాప్సూల్స్‌ను చెన్నై విమానాశ్రయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Chennai, Tamil Nadu | 45 ball pythons, 3 marmosets, 3 star tortoises & 8 corn snakes were found in two bags of a passenger who arrived at Chennai airport from Bangkok on January 11. The recovered wildlife species were deported to Bangkok on January 12: Customs pic.twitter.com/wmJ3q8tlkR
— ANI (@ANI) January 16, 2023