Harassment : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 12ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్ – జబల్‌పూర్ జిల్లాలోని చార్గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా, నిందితులందరినీ అరెస్టు చేశామన్నారు. నిందితులను పంచమ్ ఠాకూర్, బ్రిజేష్ ఠాకూర్, బాలి ఠాకూర్ గా పేర్కొన్నారు.
సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP) ప్రియాంక శుక్లా మాట్లాడుతూ, పంచమ్ ఠాకూర్ అనే వ్యక్తి నెల క్రితం మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో చార్గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ వద్ద ఆమెను కలిశాడు. ఆమెను నగరంలోని తన మేనత్త నివాసంలో దింపుతామంటూ ప్రలోభపెట్టి బైక్‌పై తీసుకెళ్లాడు. ఈ సమయంలో మరో ఇద్దరు నిందితులు బ్రిజేష్, బాలి కూడా ఉన్నారు. మార్గంలో, నిందితులు రోడ్డుపై బైక్‌ను ఆపి, మైనర్ బాలికను అడవిలోకి తీసుకెళ్లారు, అక్కడ పంచమ్, బ్రిజేష్ ఆమెపై అత్యాచారం చేశారు. వీరికి బాలి సాయం చేసినట్లు బాధితురాలు తెలిపింది.
Read Also:Yadadri Temple: 18న యాదాద్రి సందర్శనకు కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలు!
ఆ తర్వాత బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు చార్గవాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురు నిందితులపై సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేసినట్లు CSP శుక్లా తెలిపారు.