Surender Matiala: దేశ రాజధానిలో దుండగుల కాల్పులు.. బీజేపీ నేత హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surender Matiala: ఢిల్లీలోని ద్వారకా జిల్లాలోని బిందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటియాలా రోడ్‌లో తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం స్థానిక బీజేపీ నాయకుడు సురేంద్ర మతియాలాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని మృతుడి బంధువు రామ్ సింగ్ పేర్కొన్నారు. దుండగులు అనేక రౌండ్లు కాల్చారని.. అందులో 4-5 బుల్లెట్లు సురేంద్రను తాకాయని.. నేరం చేసిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. మొత్తం నలుగురు వ్యక్తులు కార్యాలయంలో కూర్చున్నట్లు రామ్ సింగ్ తెలిపారు.
Read Also: ఆడవారిలో గడ్డాలు, మీసాలు.. ఎందుకు వస్తాయి.. పోవాలంటే?
Also Read
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్‌కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
సురేంద్ర మతియాలా టీవీ చూస్తుండగా.. తాను, మరో ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో సురేంద్రపై కాల్పులు జరిగాయని రామ్ సింగ్ వెల్లడించారు. విషయం అర్థమయ్యే సమయానికి సురేంద్ర మతియాలాపై కాల్పులు జరిగాయన్నారు. బీజేపీ స్థానిక నాయకుడు సురేంద్ర మతియాలా ఇమేజ్ ఈ ప్రాంతంలో చాలా బాగుందని, ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని కొందరు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కార్యాలయం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ద్వారకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామని, ఈ దశలో ఉద్దేశం స్పష్టంగా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్‌కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!