చాలా మంది మహిళలు చూడటానికి అందంగా కనిపించినా చంపలపై, మూతిపై వెంట్రుకలు కనిపిస్తుంటాయి. ఇవి చూసే వారు వారిని మగరాయుడు అన్నట్లుగా కామెంట్లు సైతం చేస్తుంటారు.
స్త్రీలలో మీసాలు, గడ్డాలు పెరగటాన్ని హిర్సుటిజం అంటారు. హార్మోన్ల అస్తవ్యస్థం కారణంగా ఈ తరహా వెంట్రుకల పెరుగుదల కనిపిస్తుంది.
శరీరంలో కీలక హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్, పిట్యూటరీ, థైరాయిడ్ వంటి గ్రంథుల హార్మోన్ వ్యవస్థలో లోపాలు, పురుష హార్మోన్ స్ధాయిలు పెరిగిన సందర్భంలో ఈ పరిస్ధితి తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని రకాల మందులు, స్టెరాయిడ్స్ వల్ల కూడా అవాంఛిత రోమాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చిట్కాల ద్వారా వీటిని తొలగించుకోవచ్చు
స్పూన్ నిమ్మరసంలో స్పూన్ పంచదారని కలిపి పెదవిపై రాసి సుమారు అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. అనంతరం రోజ్ వాటర్ పెదాలకు రాయాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
స్వచ్ఛమైన పసుపు తీసుకుని, అందులో కొంచం నీళ్లు పోసి మెత్తగా చేసి రోమాలు ఉన్న పెదవిపై అప్లై చేసి సుమారు గంట పాటు ఉంచాలి. ఇలా నెలరోజులు చేస్తే వాటి పోగొట్టుకోవచ్చు.
గుడ్డు తెల్లసొనలో కొంచెం మొక్కజొన్న పిండి, పంచదార కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాల పెరుగుదలను ఆపవచ్చు.
ఒక స్పూన్ బంగాళాదుంప రసం తీసుకుని అందులో అరస్పూన్ మైదా పిండి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదవులపై రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు చేస్తే మేలు.
శనగపిండిలో కొంచెం నీళ్లు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చేతి వేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తుండడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.