Tiranga Yatra: భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ బీజేపీ పార్టీ మంగళవారం (మే 13) నుంచి దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర మే 13 నుంచి మే 23 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. తాజాగా విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ యాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నేడు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. దేశభక్తి, ఐక్యత, సైనికుల సేవలకు గౌరవం తెలిపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ జెండా అయిన ‘తిరంగా’కి గౌరవాన్ని పెంచుతూ, ప్రజలలో దేశభక్తి భావాన్ని నాటడం లక్ష్యంగా బీజేపీ ఈ యాత్ర చేప్పట్టబోతుంది.
Read Also: Lokesh Kanagaraj : లోకేశ్ కనగరాజ్ నెక్ట్స్ సినిమాల పరిస్థితి ఏంటి.?
ఈ యాత్రను జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా నేతృత్వంలో చేపడుతున్నారు. ఆయనతో పాటు సంబిత్ పత్రా, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ లాంటి కీలక నేతలు యాత్ర నిర్వహణలో భాగస్వాములు కానున్నారు. మే 11న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డా తదితరులు యాత్ర కార్యాచరణపై సమగ్ర చర్చలు జరిపారు. యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, జాతీయ పతాకావందన కార్యక్రమాలు, ప్రజా సదస్సులు, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రచారం చేసే అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలతో సైనికుల మధ్య మమకారాన్ని పెంచుతూ, దేశ భద్రతపై మోడీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించడమే ఈ యాత్ర లక్ష్యం.
Read Also: Operation Sindoor: దేశభక్తిని చాటుకున్న పేరెంట్స్.. 17 మంది నవజాత బాలికలకు ‘సింధూర్’ అని నామకరణం
అయితే, ఈ యాత్రకు ఎటువంటి రాజకీయ కోణం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇది దేశం కోసం పోరాడిన సైనికుల సాహసాన్ని గుర్తించి, ప్రజలను ఐక్యంగా తీర్చిదిద్దే ప్రణాళికగా తీసుకున్నారు. ఈ ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా దేశభక్తి వాతావరణం నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణాలు, గ్రామాల్లో తిరంగా ఎగురవేస్తూ.. ప్రతి ఒక్కరిలో దేశానికి గౌరవం, సైనికుల పట్ల గౌరవాన్ని పెంచాలనేది యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.
