BJP government: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ‘ఆర్థిక ఉగ్రవాదాన్ని’ ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థికంగా దెబ్బ తీసేందుకు తమ బ్యాంకు ఖాతాల నుంచి 65 కోట్ల రూపాయలకు పైగా ‘దోపిడీ’ చేశారని ఆ పార్టీ పేర్కొంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని ‘నియంతృత్వ పాలన’గా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.
Read Also: Anchor Pradeep : పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రదీప్..
కాంగ్రెస్‌పై బీజేపీయే ఆర్థిక ఉగ్రవాదాన్ని ప్రారంభించింది అని వేణుగోపాల్ అన్నారు. ఈ డబ్బును సామాన్యులు, కార్మికుల నుంచి స్వీకరించాం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రీజ్ చేశారు.. బ్యాంకుల నుంచి మన సొమ్ము దోచుకోవడమే ప్రాథమిక విషయం.. ఎన్నికల్లో ప్రతిపక్షాలను బలహీన పర్చేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. మేం పోరాడతాం.. మేము ట్రిబ్యునల్‌కి వెళ్లాము.. ప్రజల వద్దకు వెళ్తాము.. ఎందుకంటే ప్రజలే ప్రధానులు అని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Read Also: Yashasvi Jaiswal: బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్ కొన్న యశస్వి జైస్వాల్.. ధర ఎంతంటే?
అన్ని విపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా దాడి చేసి.. మోడీ ప్రభుత్వం మా ఖాతాలను దోచుకుని డబ్బును లాక్కుందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. కాంగ్రెస్ తో పాటు ఇండియన్ యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఖాతాల నుంచి రూ.65,88,81,474 కోట్లు విత్‌డ్రా అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇది కాంగ్రెస్‌ను ఆర్థికంగా హత్య చేసే ప్రయత్నం కాదు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.
Read Also: Union Bank Jobs 2024: యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుందనే భయంతో బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బి. తన సంస్థ ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్న సొమ్మును కార్మికులు జమ చేశారని తెలిపారు. ఈ నియంతృత్వ వైఖరికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.. 210 కోట్ల రూపాయల రికవరీ డిమాండ్‌ను పేర్కొంటూ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ ప్రధాన ఖాతాలను స్తంభింపజేసింది అనే విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ తదుపరి విచారణ వరకు కాంగ్రెస్ పార్టీ ఖాతాలపై నిషేదం ఎత్తివేసిందని జైరాం రమేష్ వెల్లడించారు.