కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 'ఆర్థిక ఉగ్రవాదాన్ని' ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థికంగా దెబ్బ తీసేందుకు తమ బ్యాంకు ఖాతాల నుంచి 65 కోట్ల రూపాయలకు పైగా 'దోపిడీ' చేశారని ఆ పార్టీ పేర్కొంది.