Karnataka: పబ్లిక్ ఎగ్జామ్‌పై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో (karnataka) పరీక్ష సమయాల మార్పుపై (Exam timings) అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ప్రీ యూనివర్సిటీ పరీక్షల సమయాలను సర్దుబాటు చేస్తూ మైనారిటీలను మభ్యపెడుతోందని బీజేపీ ఆరోపించింది.
ఇటీవల SSLC మరియు ప్రీ-యూనివర్శిటీ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. అయితే శుక్రవారం మాత్రం SSLC పరీక్షా సమయం ఉదయం నుంచి మధ్యాహ్నానికి మార్చారు. దీంతో ప్రతిపక్ష పార్టీ బీజేపీ (BJP) మండిపడింది. అన్ని పరీక్షలు ఉదయం నిర్వహించి శుక్రవారం మాత్రం షెడ్యూల్‌కు భిన్నంగా మధ్యాహ్నం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నిలదీసింది. ముస్లిం సమాజాన్ని శాంతింపజేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఉదయం నమాజ్ చేసుకునేందుకు వీలుగానే సమయం మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి హరిప్రకాష్ ఆరోపించారు.
Also Read
- RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ (Congress) ఖండించింది. వేరే పరీక్షా సమయాలను సర్దుబాటు చేయడానికి ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 1న పీయూసీ పరీక్ష ప్రారంభం కావడంతో అదే రోజు మధ్యాహ్నం ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష జరగనుంది. పరీక్షల సమయాన్ని సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
SSLC కోసం ప్రిపరేటరీ పరీక్షలు ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 2న ముగియనుండగా, పీయూసీ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.
తాజావార్తలు
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
-
Hi: ఆగస్టు 14న కవిన్‌తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!