GT vs RR: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించగా సంజు సామ్సన్ నేతృత్వంలోని జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఇకపోతే, రెండో ఇన్నింగ్స్‌లో ఆడే సమయంలో మంచు ప్రభావం ఉంటుందన్న కారణంతో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జట్టు మంచి మోమెంటంలో ఉందని, అదే కొనసాగించాలని భావిస్తున్నట్లు టాస్ సమయంలో తెలిపాడు. తనకు కెప్టెన్‌గా నాయకత్వం వహించడం, బ్యాటింగ్ చేయడం, కీపింగ్ చేయడం చాలా బాగుందని తెలిపాడు. పిచ్ చాలా మంచిగా ఉందని, జట్టు నుంచి హసరంగ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడని తెలిపాడు. ఇక అతని స్థానంలో ఫారూకీ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఇక గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ నే ఎంచుకునేవాడినని అన్నారు. తమ మిడిలార్డర్‌కు బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ డెలివరీలు లభించడం లేదని.. అయితే టాప్ ఆర్డర్ మంచి ఫినిష్ ఇస్తే అదే సరిపోతుందని అన్నారు. ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. ఇక ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Aadhaar App: ఆధార్ కార్డ్ కష్టాలకు ఇకపై చెక్.. కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుధర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ఇషాంత్ శర్మ
ఇంపాక్ట్ సబ్ ప్లేయర్లు: వాషింగ్టన్, అర్షద్, రవాత్, లొమ్రోర్, సింధు.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI :
యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీశ్ రానా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, శిమ్రాన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, ఫజల్హక్ ఫారూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
ఇంపాక్ట్ సబ్ ప్లేయర్లు: దుబే, యుధ్వీర్, కార్తికేయ, మాధవాల్, రాథోడ్.