రోడ్డుపై ఏదైనా పడితే చాలు.. అయ్యో మీది పడిపోయింది.. ఇదిగో తీసుకోండి అని ఇచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందేమో అనే డౌట్ కొన్ని ఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది.. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇది రుజువైంది కూడా.. కోళ్ల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడినప్పుడు, లిక్కర్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టినప్పుడు, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్‌లో బోల్తా కొట్టినప్పుడు, మంచినూనె లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురైనప్పుడు.. సదరు బాధితుడికి సాయం చేయకపోవడం పక్కనపెడితే.. అందినకాడికి దండుకొనిపోయినవారే తప్పితే.. అయ్యోపాపం అనే నాదుడే లేడే అనిపించింది.. తాజాగా, బిస్కెట్ల ప్యాకెట్ల లోడ్‌తో వెళ్తున్న ఆటో నుంచి.. ప్యాకెట్లు రోడ్డుపై పడిపోయాయి.. అది గమనించని సదరు ఆటో డ్రైవర్ అలాగే ముందుకు సాగాడు.. కానీ, వెనుకాల కార్లలో, బైక్‌లు, ఇతర వాహనాలపై వస్తున్నవారు.. వారి వాహనాలను ఆపిమరి.. అందినకాడికి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లిపోయారు.
Read Also: Students: కండ్ల కలకలతో 60 మంది విద్యార్థులు ఇబ్బందులు..
గండేపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిస్కెట్ ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న ఆటోకి కట్టిన తాడు తెగిపోయింది.. దాంతో, ఆటోలో ఉన్న బస్కెట్ల ప్యాకెట్లకు సంబంధించిన కేసులు రోడ్డుపై పడిపోయాయి.. ఇక, ఆటో వెనకాలే వెళ్తున్న కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలను ఆపి మరీ.. బిస్కెట్ల ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు ప్రజలు.. రాజమండ్రి నుంచి తునికి బిస్కెట్ల లోడ్‌తో ఆటో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, విషయం తెలిసి ఆటో ఆపి వెనక్కి వచ్చారు.. ఆటో డ్రైవర్, క్లీనర్.. కానీ, అప్పటికే అందిన కాడికి, దొరికొనకాడికి.. దొరికినట్టు పట్టుకుని పెళ్లిపోయారు ప్రజలు.. దీంతో, తన ఓనర్‌కి ఏమి చెప్పాలో తెలియక లబోదిబోమంటున్నాడు డ్రైవర్.