బాలీవుడ్ గ్లామర్ క్వీన్ బిపాషా బసు తన 47వ పుట్టినరోజు (జనవరి 7) సందర్భంగా మహిళలకు ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ‘ఫిట్‌నెస్ అంటే ఏదో డైటింగ్ చేసి సన్నగా అయిపోవడం కాదు.. మన శరీరం లోపలి నుంచి ఎంత బలంగా ఉందనేదే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు. మన దేశంలో జిమ్ కల్చర్ గురించి పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే బిపాషా ఫంక్షనల్ ఫిట్‌నెస్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. బరువులు ఎత్తడం (Weight Training) కేవలం మగవారికి మాత్రమే కాదు, మహిళలకు కూడా చాలా అవసరమని ఆమె గట్టిగా చెబుతున్నారు. అంతే కాదు..
Also Read :Shivaji-Anasuya : సడన్‌గా శివాజీ విషయంలో రూట్ మార్చిన అనసూయ.. వీడియో వైరల్
కండలు వచ్చేస్తాయనే భయం వద్దు! చాలామంది మహిళలు వెయిట్ ట్రెయినింగ్ చేస్తే మగవారిలా కండలు వచ్చేస్తాయని భయపడతారు. కానీ ఇందులో అసలు నిజం లేదని నిపుణులు చెప్తున్నారు. ఆడవారిలో కండరాలు పెరగడానికి కారణమయ్యే హార్మోన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, బరువులు ఎత్తడం వల్ల శరీరం లావుగా మారదు.. పైగా అనవసరమైన కొవ్వు కరిగి బాడీ మంచి షేప్‌లోకి వస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనత, వెన్నునొప్పి వంటి సమస్యల నుంచి బయటపడాలంటే మహిళలకు వెయిట్ ట్రెయినింగ్ చాలా ముఖ్యం.