Maoist Party: బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య పెరిగింది. భద్రతా దళాలు ఇప్పటివరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది నక్సలైట్లు చనిపోయినట్లుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు జవాన్లు మృతి చెందారు.. నిన్న 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: YS Jagan: పండుగలా ఉండాల్సిన వ్యవసాయం.. చంద్రబాబు హయాంలో దండుగలా మారింది!
మరోవైపు.. ఇటీవల ఏపీలో హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా భూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. “హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకుని చిత్ర హింసలు పెట్టి చంపేశారు.. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లనే వీళ్ళు దొరికిపోయారు.. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లారు.. కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళితే వాళ్ళని పట్టుకున్నారు.. వారం రోజులపాటు చిత్రహింసలకు గురిచేసి ఆంధ్ర పోలీసులు చంపేశారు.. హుడ్మా, శంకర్ల ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి..” అని లేఖలో డిమాండ్ చేశారు.