Bullet Bike: దారుణం.. బుల్లెట్ బైక్ కట్నంగా ఇవ్వలేదని విషమిచ్చి చంపేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bullet Bike: వరకట్న వేధింపులు సమాజంలో వేళ్ళూనుకుపోయాయి. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారని అందరూ అనుకుంటారు. అది నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరొకవైపు వేధింపులకు గురయ్యేవారు, మోసపోతున్నవారు, చేయని తప్పులకు బాధితులుగా మారుతున్న మహిళలు ఉన్నారు. వరకట్నం దాహానికి బీహార్‌లో ఓ మహిళ బలైంది. వివాహ సమయంలో బుల్లెట్ బండి కట్నంగా ఇస్తానని ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళను అత్తమామలు విషమిచ్చి హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని బక్సర్ జిల్లాలో పవార్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
Also Read: Gujarat: ముదిరిన “దర్గా” వివాదం.. పోలీస్ స్టేషన్‌పై ఓ వర్గం రాళ్ల దాడి.. ఒకరు మృతి
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
బక్సర్ జిల్లాలో కట్నంగా బుల్లెట్ మోటార్ సైకిల్ ఇవ్వలేదని ఓ మహిళకు అత్తమామలు విషమిచ్చి హత్య చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం, మహిళకు గత సంవత్సరం వివాహం జరిగింది. బుల్లెట్ మోటార్ బైక్ డిమాండ్‌ను నెరవేర్చనందుకు నిరంతరం శారీరక వేధింపులకు గురిచేశారు. ఘటన జరిగిన రోజు ఆమె ఆరోగ్యం క్షీణించిందని అత్తమామలు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు విషం ఎక్కించారని, ఆ తర్వాత ఆమె చనిపోయిందని తెలిపారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్నం కింద ద్విచక్రవాహనం ఇవ్వలేదని విషమిచ్చి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకొన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!