Site icon NTV Telugu

Bihar Train Accident: బీహార్‌లో రైలు ప్రమాదం.. రైల్వే ట్రాలీని ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్..

Bihar Train Accident

Bihar Train Accident

బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కతిహార్ బరౌని రైల్వే సెక్షన్‌లోని కధగోలా, సేమాపూర్ మధ్య మహారాణి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బరౌని నుంచి కతిహార్‌కి వస్తున్న 15910 అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలు.. రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలీమ్యాన్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ఈ సంఘటన సోన్‌పూర్ రైల్వే డివిజన్‌లో జరిగింది. ప్రమాదం కారణంగా.. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. సిబ్బంది వెంటనే పునరుద్ధరించారు.

READ MORE: India vs England: తొలి టెస్టులో నల్ల బ్యాండ్స్ ధరించి, నిమిషం మౌనం పాటించిన ఇరు జట్ల ఆటగాళ్లు.. ఎందుకంటే..?

ఈ సంఘటనకు సంబంధించిన కతిహార్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్(ADRM) మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన ప్రాంతం కతిహార్ రైల్వే డివిజన్‌కు ఆనుకొని ఉన్నందున, కతిహార్ నుంచి వైద్య బృందాన్ని పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం, గాయపడిన వారందరినీ సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు… ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే యంత్రాంగం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రైల్వే సిబ్బంది ట్రాక్‌పై పనిచేసేటప్పుడు గరిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

READ MORE: Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. మాజీ డీజీపీ ఒత్తిడితోనే!

Exit mobile version