బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కతిహార్ బరౌని రైల్వే సెక్షన్‌లోని కధగోలా, సేమాపూర్ మధ్య మహారాణి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బరౌని నుంచి కతిహార్‌కి వస్తున్న 15910 అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలు.. రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలీమ్యాన్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.