Women Empowerment: ఇది నిజంగానే గుడ్ న్యూస్.. ప్రతి మహిళకు రూ.10 వేలు అందజేస్తున్నారు. ఎక్కడని ఆలోచిస్తున్నారా.. బిహార్‌లో. కేంద్రం ప్రవేశ పెట్టిన ‘లఖ్పతి దీదీ’ పథకం ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నట్లే, బిహార్‌లో ‘జీవిక దీదీ’ అనే పథకాన్ని మహిళలకు ప్రోత్సాహకంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి అవకాశాలను ప్రారంభించాలనుకునే రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ.10 వేలు ప్రారంభ సహాయంగా అందించనున్నారు.
READ ALSO: Sajjala Ramakrishna Reddy : దమ్ము అనేది ఉంటే జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి
మహిళలను ఆకర్షించడానికేనా..
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈక్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళలను ఆకర్షించడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం నితీష్ కుమార్ ఆగస్టు 29న సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈ పథకానికి ఆమోదం వచ్చింది. రాష్ట్రంలోని 2.7 కోట్ల కుటుంబాలలోని ప్రతి మహిళ ఈ పథకంతో అనుసంధానించబడుతుందని ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఇది మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. గతంలో కూడా నితీష్ మద్య నిషేధ ప్రచారం, ఉపాధ్యాయ నియామకాలలో మహిళా రిజర్వేషన్ వంటి అంశాల ద్వారా రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకర్షించారు.
పథకానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలలో ఏం చెప్పారంటే.. ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా జీవికా దీదీ స్వయం సహాయక బృందం (SHG)లో చేరాలి. ఆరు నెలల తర్వాత ఆ మహిళ వ్యాపారం బాగా నడిస్తే, దానిని విస్తరించడానికి రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. ఈ పథకంలో భాగంగా మొదటి దశలో రూ.10 వేలు అందజేస్తారు. ఆ తరువాత వ్యాపార పరిస్థితిని బట్టి రూ.15 వేలు, రూ.75 వేలు లేదా గరిష్టంగా రూ.2 లక్షల రుణం ఇవ్వనున్నారు. వడ్డీ రేటు సంవత్సరానికి 12% ఉంటుంది. అయితే మహిళలపై భారం పడకుండా ఉండటానికి తిరిగి చెల్లించే వ్యవధి 1 నుంచి 3 సంవత్సరాల మధ్య నిర్ణయించారు.
జీవికా దీదీ యోజనను బీహార్ గ్రామీణ జీవనోపాధి ప్రమోషన్ కమిటీ (BRLPS) నిర్వహిస్తుంది. ఇది 2006లో ప్రపంచ బ్యాంకు సహాయంతో ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10.81 లక్షల స్వయం సహాయక బృందాలు చురుకుగా పని చేస్తున్నాయి. 1.34 కోట్ల మంది మహిళలు ఈ స్వయం సహాయక బృందాల వారితో అనుబంధంగా ఉన్నారు. ఈ బృందాలు వ్యవసాయం, పశుసంవర్ధకం, హస్తకళలు, కిరాణా దుకాణాలు, కుట్టు-ఎంబ్రాయిడరీ, చిన్న పరిశ్రమల నుంచి మహిళల ఆదాయాన్ని పెంచుతున్నాయి. ఇటీవల ఈ స్వయం సహాయక బృందాలు జీవికా నిధి క్రెడిట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కింద ఏర్పడ్డాయి. ఇది బ్యాంకు లాగా చౌక ధరలకు మహిళలకు రుణాలు అందిస్తుంది.
READ ALSO: Vitiligo Disease: చర్మంపై తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా?.. వ్యాధి ఏంటో తెలుసా!