Vitiligo Disease: చర్మంపై తెల్లటి మచ్చలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా.. పలువురు వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చర్మంపై తెల్లటి మచ్చలు విటిలిగో అనే ఓ వ్యాధి కారణంగా వస్తాయి. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైందా.. ఇది ఒకరి నుంచి మరొకరికి వస్తుందా.. అనేది చాలా మందికి తెలియదు. ఈ వ్యాధి వచ్చిన వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వ్యాధికి చికిత్స మార్గాలు ఏంటనేది ఈ స్టోరీ తెలుసుకుందాం..
READ ALSO: Festival Sale : భారీ ఆఫర్లతో అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ ఫెస్టివల్ సేల్
విటిలిగో లేదా హైపోపిగ్మెంటేషన్..
వైద్య పరిభాషలో తెల్లని మచ్చలను విటిలిగో లేదా హైపోపిగ్మెంటేషన్ అని పిలుస్తారు. ఈసందర్భంగా పలువురు చర్మ సంబంధిత వైద్య నిపుణులు మాట్లాడుతూ.. మన చర్మానికి రంగును ఇచ్చే వర్ణద్రవ్యం మెలనిన్. ఎప్పుడైతే ఇది ఏర్పడటం ఆగిపోతుందో అప్పుడు చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మెలనిన్ కణాలు చనిపోవడం ప్రారంభించినప్పుడు అక్కడ తెల్లని మచ్చలు కనిపించడం ప్రారంభమవుతాయి. ప్రారంభంలో ఈ మచ్చలు చిన్నవిగా ఉండటంతో పాటు ఒకే చోట కనిపిస్తాయి. సకాలంలో వీటిపై శ్రద్ధ చూపకపోతే, అవి శరీరం అంతటా వ్యాపించవచ్చని అంటున్నారు. ఈ మచ్చల కారణంగా ఎటువంటి మంట లేదా నొప్పి ఉండదని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది దీనిని కుష్టు వ్యాధిగా, లేకపోతే మరేదో అంటు వ్యాధని భ్రమపడతారు. కానీ ఇది అంటువ్యాధి కాదని, వేరొకరిని తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని వైద్యులు పేర్కొన్నారు.
ఈ వ్యాధి ఎందుకు వస్తుంది..
ఈ వ్యాధి ఒకే ఒక్క కారణంతో రాదు. కొన్ని సందర్భాల్లో ఇది జన్యుపరమైనదిగా ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, తరువాతి తరంలో కూడా దీని ప్రమాదం పెరుగుతుంది. మరికొన్నిసార్లు ఇది శరీరం లోపల జరుగుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధికి సంకేతంగా రావచ్చు. అంటే కొన్నిసార్లు శరీర రక్షణ వ్యవస్థ పొరపాటున చర్మాన్ని దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. అప్పుడు చర్మంపై ఈ తెల్లని మచ్చలు ఏర్పడతాయి.
చికిత్స మార్గాలు..
ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే.. మందులు కొన్ని టాపికల్ క్రీములతో చికిత్స చేయడం సాధ్యమవుతుందని వైద్యులు అంటున్నారు. స్టెరాయిడ్ క్రీమ్, ఫోటోథెరపీ లేదా స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి పద్ధతులతో వైద్యులు ఈ వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చని చెప్తున్నారు. కొన్నిసార్లు ఇది విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా కూడా వస్తుందని, అప్పుడు విటమిన్ బి12 లేదా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.
READ ALSO: CM Chandrababu: ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు