బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడనే అంచనాలున్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన వివాదం మొదలైంది. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో ‘జై జవాన్’ సెంటిమెంట్‌ను సొంతం చేసుకుని, సింపుల్ ఆటిట్యూడ్‌తో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్‌కు జనాలో భారీ మద్దతు ఉంది. అయితే, ఫైనల్స్ ముందు.. ఎస్.జె. సుందర్ అనే ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ, కళ్యాణ్ ఇండియన్ ఆర్మీ కాదని, కేవలం CRPFలో పనిచేసి వచ్చేశాడని ఆరోపించాడు. ఆర్మీ నియమాలను ఉల్లంఘించాడని, క్రమశిక్షణ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో ‘జై జవాన్’ సెంటిమెంట్‌పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
Also Read : Pragathi: నన్ను ట్రోల్ చేసిన వారికి.. పతకాలతో సమాధానం ఇచ్చాను !
ఈ ఆరోపణలను కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆర్మీ అయినా, CRPF అయినా దేశ సేవ చేసినట్లేనని, కావాలనే ఈ అసూయతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. బిగ్ బాస్ ప్రారంభంలోనే కళ్యాణ్ తాను రాజీనామా చేసి నటన వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఆర్మీ అనేది కుటుంబ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. గతంలో ‘జై కిసాన్’ సెంటిమెంట్ పనిచేసినట్లే, ఇప్పుడు ‘జై జవాన్’ కూడా కళ్యాణ్‌ను గెలిపిస్తుందనే అంచనాలున్నాయి. ఫైనల్ ముందు వచ్చిన ఈ వివాదం ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం కళ్యాణ్ పడాలకే పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు.