Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైంది. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే ఈ రియాలిటీ షోలోకి ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో పది మంది ప్రముఖ సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల వారపు రెమ్యూనిరేషన్లు, వారి పేమెంట్ ఒప్పందాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల ప్రజాదరణ, వారి సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా ప్రతీ కోణాన్ని పరిగణలోకి తీసుకొని యాజమాన్యం వారానికి ఇంత అని ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ సీజన్లో సెలబ్రిటీలకు చెల్లిస్తున్న పారితోషికాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. వాటిలో ముఖ్యంగా..
Also Read
- Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
- Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
- Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాంప్రసాద్ (జబర్దస్త్): వారానికి రూ. 4.5 లక్షలు. ఈ సీజన్ సెలబ్రిటీలందరిలోనూ ఇతనికే అత్యధిక రెమ్యూనిరేషన్ అందుతోంది.
వర్షిని సౌందర్యరాజన్: వారానికి రూ. 3.75 లక్షలు (కొన్ని చోట్ల రూ. 3.5 లక్షలుగా కూడా పేర్కొన్నారు).
ముకేష్ గౌడ: వారానికి రూ. 3 లక్షలు.
త్రిగున్ (అలియాస్ అదిత్ ఈశ్వరన్): వారానికి రూ. 2.75 లక్షలు.
దేవ్జాని: వారానికి రూ. 2.75 లక్షలు.
నరేష్ (జబర్దస్త్): వారానికి రూ. 2.5 లక్షలు.
చైత్ర రాయ్: వారానికి రూ. 2.5 లక్షలు.
టెంపర్ వంశి: వారానికి రూ. 2 లక్షలు.
కృష్ణుడు (వినాయకుడు మూవీ హీరో): వారానికి రూ. 2 లక్షలు.
సుధీర్ రెడ్డి: వారానికి రూ. 1.25 లక్షలు అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక కామనర్ల రెమ్యూనిరేషన్ వివరాల్లోకి వెళ్తే.. కామనర్స్ నుంచి ఎంపికైన కంటెస్టెంట్లకు సెలబ్రిటీలతో పోలిస్తే వేరే రకమైన పేమెంట్ నిర్మాణం ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపికై ప్రవేశించిన ఆరుగురు కామనర్లకు వారానికి రూ. 70,000 చొప్పున పారితోషికం ఇస్తున్నారు. ఈ సీజన్లో ప్రాథమిక ఎంపిక ప్రక్రియలో భాగంగా ‘అగ్ని పరీక్ష’కు హాజరైన 15 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ బట్టలు, హోటల్ వసతి, ట్రావెలింగ్ ఖర్చుల నిమిత్తం రూ. 50,000 చెల్లించారు. కంటెస్టెంట్లతో బిగ్ బాస్ యాజమాన్యం చేసుకునే ఆర్థిక ఒప్పందాలు, చెల్లింపుల నియమావళి పక్కాగా రూపొందించబడతాయి. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లకు అవసరమైన బట్టలు, కాస్ట్యూమ్స్ కొనుగోలు, ఇతర ప్రాథమిక ఖర్చుల కోసం మొదటి వారం రెమ్యూనిరేషన్ను గ్రాండ్ లాంచ్ డేకి రెండు రోజుల ముందే వారి బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ చేస్తారు.
కంటెస్టెంట్లకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండి వివరాలు సబ్మిట్ చేస్తే, మాట్లాడుకున్న మొత్తానికి 18 శాతం GST కలిపి చెల్లిస్తారు. జీఎస్టీ లేని పక్షంలో, ఒప్పందం ప్రకారం మాట్లాడిన అమౌంట్‌ను జీఎస్టీ లేకుండానే పే చేస్తారు. ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత, షో మొత్తం ముగిసాక వారి బకాయిలను చెల్లిస్తారు. మొదటి 80 శాతం అమౌంట్‌ను 3 నెలల వ్యవధిలో చెల్లిస్తారు. మిగిలిన 20 శాతం అమౌంట్‌ను ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తారు. షో పూర్తయిన 3 నెలల తర్వాత నుంచి.. తదుపరి 9 నెలల పాటు (మొత్తంగా ఒక సంవత్సరం) వేరే పోటీ ఛానల్స్‌లో ఇలాంటి రియాలిటీ షోలలో పాల్గొనకూడదని కంటెస్టెంట్లతో కఠినమైన ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!