Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabaali Teaser: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రణబాలి’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం టీజర్ రిలీజ్ డేట్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌పై అధికారిక అప్డేట్ ఇచ్చింది. ‘రణబాలి’ మాస్ యాక్షన్ టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘‘ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ రైజెస్’’ అంటూ టీజర్‌పై హైప్ పెంచేలా వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాకు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కథ 19వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ఆధారంగా చేసుకుని భారీ యాక్షన్ డ్రామాగా సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సీవాలా’ మంచి విజయాన్ని అందుకోవడంతో ‘రణబాలి’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఈసారి మరింత భారీ స్కేల్లో, యాక్షన్, పీరియాడిక్ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
మరోవైపు ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 9న ‘రణబాలి’ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో విజయ్ అభిమానుల్లో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. టీజర్‌తో సినిమా కథ, విజయ్ పాత్రపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో అందరి చూపు ఇప్పుడు సెప్టెంబర్ 9పైనే ఉంది.
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?