బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ సీరియల్ ద్వారా ఓ రేంజులో పాపులర్ అయిన శోభా ఇటీవలే స్టార్ మా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను అందుకుంది.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ వ్యవహారాన్ని సైతం బయటపెట్టింది. బిగ్ బాస్ షోలో నెగిటివిటీ తెచ్చుకొని బయటికి వచ్చేసింది శోభా శెట్టి.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
శోభా శెట్టి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది.. ఎందుకు సీక్రెట్ గా చేసుకొందో చెప్పలేదు ..కానీ అందుకు సంబందించిన ఫొటోలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. తన సహనటుడైన యశ్వంత్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఈమె బిగ్ బాస్ హౌస్ లో తెలియజేసింది.హౌస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే వీరు ఒక స్టేజి మీద రింగులు మార్చుకుంటూ కూడా కనిపించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పలు రకాల వీడియోలు కూడా చేయడం జరిగింది. తాజాగా వీరిద్దరూ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది..
యశ్వంత్,శోభా ఇద్దరు కార్తీక దీపం సీరియల్ లో నటించారు.. అప్పుడే ప్రేమలో పడ్డారు.. ఇద్దరు చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు.. ఇక బిగ్ బాస్ కు వెళ్లిన శోభా ఆ విషయాన్ని బయట పెట్టింది. శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బయట నుంచి కూడా యశ్వంత్ చాలా సపోర్ట్ చేశారు.. శోభా కు ఓట్లు వేయమని ఆడియన్స్ ని కూడా అడగడం జరిగింది. శోభా శెట్టి, యశ్వంత్ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు మా సీరియల్స్ కు సంబంధించిన ఇంస్టాగ్రామ్ పేజీ కవర్లో షేర్ చేసినట్లుగా తెలుస్తున్నది.. ఆ ఫోటోలలో ఇద్దరి తల్లి, దండ్రులు కూడా ఉండటంతో ఎంగేజ్మెంట్ నిజమేనని తెలుస్తుంది.. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియాల్సి ఉంది..