బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌లో లీస్ట్ ఓటింగ్‌తో సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో రెండో ఎలిమినేషన్ ఎవరు అవుతారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. చివరి వారం నామినేషన్లలో ఉన్న మిగతా ఆరుగురిలో, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ, సంజన మరియు భరణి మధ్య పోటీ ఉందని ఆడియన్స్ భావించారు. అయితే, ఆడియన్స్ పోల్ ప్రకారం ఈ వారం రెండో ఎలిమినేషన్‌గా భరణి హౌస్ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : The Paradise : ‘ది ప్యారడైజ్’ BTS వీడియో వైరల్.. తెర వెనుక అంత కష్టం ఉందా?
నిజానికి, భరణి ఈ సీజన్‌లో ఒకసారి ఎలిమినేట్ అయ్యి, ఆ తర్వాత ప్రేక్షకులలో వచ్చిన అసంతృప్తి కారణంగా శ్రీజతో కలిసి ఓటింగ్ ద్వారా మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ తర్వాత భరణి తన ఫన్ యాంగిల్‌ను చూపించి బాగానే ఆడాడు. అయితే, అతను ఒకసారి బయటకు వెళ్లి వచ్చాడు కాబట్టి, టాప్ 5కి సంజనాని పంపించడమే కరెక్ట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫైనల్ వీక్ దాకా ఉంటాడనుకున్న భరణికి ఇది నిరాశ కలిగించే విషయమే. సుమన్ ఎలిమినేషన్ రోజునే, నాగార్జున సుమన్-భరణిల ఫ్రెండ్‌షిప్‌పై సాంగ్ వేసి వీడియో చూపించడం ద్వారా, వీరిద్దరూ ఈ వారంలోనే ఎలిమినేట్ అవుతున్నారనే హింట్‌ను బిగ్ బాస్ ముందే ఇచ్చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.