బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అందుకే సీజన్ 7 సంథింగ్ స్పెషల్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు హోస్ట్ గా కూడా నాగార్జున దాదాపు తప్పుకున్నట్టే అనే వార్తలు వినిపించాయి.. బిగ్ బాస్ 7 ను జనాలను ఆకట్టుకొనేలా ఉండాలనే సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు..
అయితే ఈ షోకు ఫెమస్ అయిన వాళ్లను తీసుకొచ్చే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలోనే షోకి కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు..? హోస్ట్‌గా ఎవరు చేస్తారు..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికి ఇంకా వాటిపై పూర్తి క్లారిటీ రాలేదు.. ఇక హోస్ట్ విషయానికి వస్తే.. గతంలో నాగార్జున చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్లేస్‌లో బాలకృష్ణ, రానా, విజయ్ దేవరకొండ ఈ మూడు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురులో హోస్ట్‌గా ఎవరు వస్తారు అనే విషయంలో ప్రజల్లో ఆశక్తి నెలకొంది.
తాజా సమాచారం మేరకు.. బిగ్ బాస్-7 సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్‌గా ఉంటారని తెలుస్తుంది. నిర్వాహకుల ఆలోచన మేరకు హోస్ట్‌లో మార్పు ఉండటం లేదని సమాచారం. నాగార్జున సైతం ఈ షో చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు వినికిడి.మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. జూలై ఎండింగ్ కల్లా కానీ ఆగష్టు ఫస్ట్ సెకండ్ వీక్ లో కానీ బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మొదలవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే సీజన్ 7 కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే పనుల్లో బిగ్ బాస్ నిర్వాహకులు బిజీగా ఉన్నారట. చూడాలి మరి ఈ సీజన్ ఎలా ఉంటుందో… ఈ షో కోసం జనాలు ఆసక్తి ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది..