Chilakaluripet Bus Accident: పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన బస్ డ్రైవర్ షరీఫ్ అని పోలీసులు తెలియజేస్తున్నారు. దీంతో షరీఫ్ అనే పేరుతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రైవర్ రాకపోవడంతో తానే డ్రైవింగ్ కు వచ్చానని అంజి చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక, అంజిబాబే చనిపోయాడని ముందుగా తాము భావించామని పోలీసులు పేర్కొన్నారు. కానీ, షరీఫ్ బంధువులు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బస్ ప్రమాదం తర్వాత భయంతో పరారైన క్లీనరే అంజిబాబు అని ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, అంజిబాబును సెల్ ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు.. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అంజిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Kalki 2898 AD : ప్రభాస్ “కల్కి” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
ఇక, చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనలో మరణించిన ఆరుగురి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తైంది. సంఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాలు పూర్తిగా దగ్దమవడంతో ఎముకులను, చితా భస్మాలను బంధువులకు పోలీసులు అప్పగించారు. ప్లాస్టిక్ పైపుల్లో చితా భస్మాన్ని, మాంసపు ముద్దలను ప్యాక్ చేసి బంధువులకు అప్పగించారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో హృదయ విదారకంగా మారింది.