HIV vs AIDS: హెచ్ఐవి వైరస్ .. ఎయిడ్స్ ఒకటేనా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV vs AIDS: వాస్తవానికి AIDS అనేది ఒక ప్రాణాంతక వ్యాధి అని, దానికి ఇంకా చికిత్స లేదని అందరికీ తెలుసు. కానీ ఎయిడ్స్ .. హెచ్ఐవి వైరస్ రెండు ఒకటి కావని మీలో ఎంత మందికి తెలుసు. AIDS అనేది HIV వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ శరీరంలో సంవత్సరాల తరబడి ఉండి, అదుపు లేకుండా వదిలేస్తే, అది AIDS కి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు తరచుగా HIV, AIDS ఒకటే అని భావిస్తారు. వాస్తవానికి ఈ రెండింటి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. AIDS అనేది HIV వైరస్ చివరి దశ. HIV ఉన్న వ్యక్తికి AIDS వస్తుందని అవసరం లేదు. HIV AIDS గా మారడానికి ఎంత సమయం పడుతుందో, దాని లక్షణాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: ASUS Ascent GX10: 128GB RAM తో AI సూపర్ కంప్యూటర్ రిలీజ్.. ధర ఎంతంటే?
Also Read
- Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
- World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
- Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
- Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. హెచ్ఐవి ఎయిడ్స్‌గా మారడానికి సగటున 9 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని అన్నారు. అయితే ఈ సమయం మారవచ్చని కూడా చెప్పారు. ఇది హెచ్ఐవి-పాజిటివ్ వ్యక్తి రోగనిరోధక శక్తి, ఆహారం, వారు ART చికిత్సను ఎప్పుడు ప్రారంభించారు అనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. వారు ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకుంటే, దీనిని గుర్తించడానికి 10 నుంచి 12 సంవత్సరాలు పట్టవచ్చని పేర్కొన్నారు. అయితే ఒక వ్యక్తి మద్యం తాగితే, సరైన ఆహారం తీసుకోకపోతే లేదా జీవనశైలి సరిగ్గా లేకుంటే హెచ్ఐవి తక్కువ సమయంలోనే ఎయిడ్స్‌గా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.
HIV కి యాంటీరెట్రోవైరల్ థెరపీని ముందుగానే ప్రారంభిస్తే, HIV AIDS గా మారకుండా నిరోధించవచ్చని డాక్టర్లు అంటున్నారు. జీవితాంతం సరైన చికిత్స పొందితే, వారికి HIV రాకపోవచ్చని పేర్కొన్నారు. అందువల్ల AIDS కి చికిత్స లేనప్పటికీ, దానిని నివారించవచ్చని వెల్లడించారు. HIV అనేది సంవత్సరాలుగా శరీరంలోని కణాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది, కానీ అది ఎటువంటి ప్రధాన లక్షణాలను కలిగించదని చెప్పారు. వైరస్ CD4 కణాలను తగ్గించడం ప్రారంభించినప్పుడు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని, దీనివల్ల అవి 400 కంటే తక్కువగా పడిపోతాయని అన్నారు. దీంతో బరువు తగ్గడం, నోటి పూతల, బలహీనత, నిరంతర జ్వరం వస్తాయని వెల్లడించారు. HIVకి చికిత్స చేయకుండా వదిలేస్తే CD4 కౌంట్ 100 కంటే గణనీయంగా తగ్గి, శరీరం తేలికపాటి అనారోగ్యాలతో కూడా పోరాడలేకపోతుందని, ఇది దీర్ఘకాలంలో మరణానికి దారితీస్తుందని చెప్పారు.
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ.. HIVని ఎప్పటికీ నిర్మూలించలేమని వివరించారు. అయితే HIV సంక్రమణ జరిగిన కొన్ని నెలల్లోనే ART చికిత్స ప్రారంభించి, వైద్యుడు సూచించిన విధంగా ఆ వ్యక్తి క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని కొనసాగిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని అన్నారు.
READ ALSO: OSD Posts: ముగ్గురు మహిళా క్రికెటర్లకు ఇండియన్ రైల్వేస్ గిఫ్ట్..
తాజావార్తలు
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
-
Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?