Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
- టీమిండియాలోకి రీఎంట్రీ ఇప్పుడు తన ప్రధాన లక్ష్యం కాదు..
- అవకాశం వస్తే భారత్ తరఫున మళ్లీ ఆడతా..
- రాకపోయినా ఎలాంటి బాధ లేదని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులోకి రీఎంట్రీ కావాలనే ఆలోచనే ఇప్పుడు తనకు ప్రధాన లక్ష్యం కాదని టెక్లచి చెప్పేసాడు. ప్రస్తుతం తాను పూర్తిగా క్రికెట్‌పై ఉన్న ప్రేమతోనే ఆడుతున్నానని, జాతీయ జట్టులో మళ్లీ అవకాశం వస్తే స్వాగతిస్తానని.. రాకపోయినా ఎలాంటి బాధ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఆర్సీబీ (RCB) పోడ్కాస్ట్లో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్.. “భారత్ తరఫున ఆడటం నా కల. ఆ కల ఇప్పటికే నెరవేరింది. తాను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే చాలా సంతోషమే. కానీ, ప్రస్తుతం నేను ఆడేది క్రికెట్‌పై ఉన్న మక్కువతో మాత్రమే” అని అన్నారు. 2022 చివర్లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన ఈ పేస్ బౌలర్.. ఇప్పటివరకు భారత్‌కు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కూడా భూవీ కీలక పాత్ర పోషించారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
అలాగే టీమిండియాలో చోటు దక్కకపోవడంపై తన కుటుంబం ఎప్పుడూ చర్చించదని భువీ చెప్పుకొచ్చాడు. “మా ఇంట్లో క్రికెట్ గురించి పెద్దగా మాట్లాడం.. జట్టులోకి ఎందుకు ఎంపిక కాలేదు.? మళ్లీ ఎప్పుడు ఆడతావు.? అనే ప్రశ్నలు ఎప్పుడూ ఉండవు. అదే నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుందని తెలిపారు.
క్రీడల్లో తరాల మార్పు సహజం. నేను మొదటి ఆటగాడిని కాదు.. చివరి ఆటగాడిని కూడా కాదు. అందుకే, ఎలాంటి బాధ లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆనందంగా స్వీకరించానని తన రీఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. తాను ఇంకా ఫిట్‌గా ఉండేందుకు దేశవాళీ క్రికెట్‌తో పాటు యూపీ టీ20 లీగ్‌లో కూడా ఆడుతున్నానని చెప్పుకొచ్చారు. ఆటతో అనుబంధం కొనసాగేందుకు తగినన్ని మ్యాచ్‌లు ఆడుతాను.. అదే సమయంలో శరీరానికి విశ్రాంతి కూడా ఇస్తాను. క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నానని తన జీవిత ప్రయాణం గురించి క్షుణంగా తెలిపారు.
మరోవైపు భారత ఫాస్ట్ బౌలింగ్ బలపడటానికి ఐపీఎల్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రవి శాస్త్రి కీలక పాత్ర పోషించారని భువనేశ్వర్ అన్నారు. ఐపీఎల్ వల్ల ఎంతో మంది యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలు వచ్చాయి. అలాగే విదేశీ పర్యటనలకు ముందు స్వదేశంలో కూడా పేస్ బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేయడం విరాట్, రవి శాస్త్రి దూరదృష్టికి నిదర్శనమని.. అలాంటి చిన్న నిర్ణయాలే భారత పేస్ దళాన్ని బలోపేతం చేశాయని పేర్కొన్నారు.
🗣️ Bhuvi: “𝙀𝙫𝙚𝙣 𝙄 𝙘𝙤𝙪𝙡𝙙𝙣’𝙩 𝙗𝙚𝙡𝙞𝙚𝙫𝙚 𝙩𝙝𝙖𝙩” 😮💨
Bhuvi looks back at that unforgettable finish against MI, the range-hitting sessions he had with DK that gave him the belief to go big, handling pressure in crunch moments, and why the team will always come… pic.twitter.com/KJhWGQDCFo
— Royal Challengers Bengaluru (@RCBTweets) August 2, 2026
అలాగే తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న భువనేశ్వర్.. మాజీ భారత పేసర్ ప్రవీణ్ కుమార్ తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. మేమిద్దరం ఒకే అకాడమీ నుంచి వచ్చాం. నేను చిన్నప్పుడు ఆయనను ఎక్కువ ప్రశ్నలు అడగడానికి సిగ్గుపడేవాడిని.. కానీ, ఆయన బౌలింగ్‌ను జాగ్రత్తగా గమనించేవాడినని అన్నారు. కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకున్న మౌలిక అంశాలే ఇప్పటికీ నా బౌలింగ్‌కు బలంగా నిలిచాయని భువనేశ్వర్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు