Chili: భారతదేశంలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటారు. పచ్చిమిర్చిని కూరలోనే కాకుండా విడిగా తినేవారు కూడా చాలామందే ఉంటారు. జనాలు పచ్చి కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పచ్చిమిర్చిని బ్యాగ్‌లో వేయమని దుకాణదారుని అడగడం మర్చిపోరు. అయితే ప్రపంచంలో అత్యంత హాట్గా ఉండే మిరప ఏది, ఏ దేశంలో పండిస్తారో తెలుసా? ఈ రోజు మనం ప్రపంచంలోని అత్యంత వేడి మిరపకాయ గురించి తెలుసుకుందాం. ప్రజలు తినడానికి మాత్రమే కాకుండా.. తాకడానికి కూడా వెనుకాడతారు.
Read Also:Tiger Nageswara Rao Twitter Review:రఫ్ ఆడించిన మాస్ మహారాజ..టైగర్ నాగేశ్వరరావు టాక్ ఎలా ఉందంటే?
ప్రపంచంలో అత్యంత ఘాటుగా ఉండే మిరపకాయ భూత్ జోలాకియా పేరు మొదటి స్థానంలో ఉంటుంది. దీనిని అస్సాంలో పండిస్తారు. ఈ కారం ప్రపంచంలోనే అత్యంత ఘాటుగా ఉంటుంది. 2007లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో దీని పేరు నమోదు కావడానికి కారణం ఇదే. విశేషమేమిటంటే దీన్ని ఘోస్ట్ పేప్పర్ అని కూడా అంటారు. అయితే, స్థానిక భాషలో అస్సాం ప్రజలు దీనిని యు-మొరోక్, లాల్ నాగా లేదా నాగా జోలోకియా అని కూడా పిలుస్తారు. అస్సాంతో పాటు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా దీనిని సాగు చేస్తారు. భూత్ జోలాకియా భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతుంది. కిలో వేల రూపాయలకు విక్రయిస్తున్నారు.
Read Also:Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యా బాగానే ఉన్నాడు.. భయపడాల్సిందేం లేదు: రోహిత్
డ్రాగన్స్ బ్రీత్ చిల్లీ రెండవ స్థానంలో ఉంది. దీనిని బ్రిటన్‌లో సాగు చేస్తారు. దీని కారం 2.48 మిలియన్ స్కోవిల్లే యూనిట్ల వరకు కొలుస్తారు. ఇది సాధారణ మిరపకాయ కంటే దాదాపు 2000 రెట్లు ఎక్కువ. దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మిరపకాయలో కొంచెం భాగాన్ని ఆహారంలో కలిపితే ఆహారం మొత్తం కారంగా మారుతుందని అంటున్నారు. అదేవిధంగా, నాగ వైపర్ కూడా ప్రపంచంలోని అత్యంత ఘాటు మిర్చిలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఒకరకమైన హైబ్రిడ్ మిరపకాయ అని అంటున్నారు. దీనిని కూడా బ్రిటన్ లోనే సాగు చేస్తారు. దీని అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఒక్కో మిర్చి రంగు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అంటే దాని రంగు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులో ఉంటుంది.