NTV Telugu Site icon

Bhatti Vikramarka : కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం జనగణనను వెంటనే మొదలు పెట్టాలి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

హన్మకొండ జిల్లా కేయు ముందు ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ ఎంపీ రాజయ్య డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లౌకిక వాదానికి భిన్నంగా అమిత్ షా మాట్లాడిన దానికి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదుపలేదని ఆయన మండిపడ్డారు. తద్వారా రాష్ట్రం నష్టపోతుందని, బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న అండర్ స్టాండ్ ఏంటీ? అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం బీఆర్ఎస్ మీ ఇద్దరికి అండర్ స్టాండ్ ఏంటి బీజేపీతో అని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, మీరు రిజర్వేషన్లు కల్పించేది ఏమిటని ఆయన మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడని, తెలంగాణలో అత్యధికంగా బహుజనులు 54 శాతం ఉన్నారన్నారు భట్టి విక్రమార్క. అమిత్ షా ఇక్కడి డిమాండ్ కు అనుగుణంగా సమాధానం చెప్పకుండా మరేదో చెప్పిపోతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ‘కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం జనగణనను వెంటనే మొదలు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీసీ సబ్ ప్లాన్ ను తీసుకురావాలి.

Also Read : Peddi Sudarshan Reddy : రూ. 2.కోట్లతో కార్యకర్తలకు సంక్షేమ నిధి

రెండు లక్షల 90 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తావ్.. 54 శాతం ఉన్న బీసీలకు ఐదు శాతం బడ్జెట్ ఇస్తారా?. బీసీలకు 50 శాతం బడ్జెట్ కేటాయించాలి. కొత్త రాష్ట్రమని రెండోసారి కేసిఆర్ కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. నిధులు నియామకాలు లేకుండా దోపిడీ చేశారు. అంతరాలు లేని సమాజం ఎదగాలి. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బిజేపి 9ఏళ్ళ 18 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. దేశప్రజల సొమ్మంతా దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ అంటే రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే గత్యంతరం లేని పరిస్థితిలో కాంగ్రెస్ గెలిపించుకోవాలి. ప్రభుత్వాలు చెప్పిన మాటకు చేతల్లో లేదు. రాష్ట్రం ఏర్పాటు సైద్ధాంతిక బలం ఇచ్చిన ప్రాతం వరంగల్‌. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ అభివృద్ధి చెందుతుందని భావించాం. స్మార్ట్ సిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని కుర్చి వేసుకుని పూర్తి చేస్తామన్నారు. పునర్విభజనలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామి అమలుకు నోచుకోలేదు.
సమస్యల పరిష్కారానికి తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్‌కే సాధ్యం.. ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం’ అని భట్టి విక్రమార్క అన్నారు.

Also Read : Tollywood: ఈ వీకెండ్ థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే!