Bhatti Vikramarka : బీసీ సంక్షేమ శాఖ పై బడ్జెట్ సన్నాహక సమీక్షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశం జరిగింది.. సమీక్షా సమావేశానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత, బీసీ వెల్ఫెర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరయ్యారు..
గతంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రస్తుతం బడ్జెట్ లో కటాయించాల్సిన అంశాల పై చర్చ జరిగింది. ప్రధానంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ , కల్యాణ లక్ష్మి, బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లకి సంబంధించి కేటాయించాల్సిన నిధులు పై మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.. బీసీ గురుకులాలకు సొంత భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని. ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సిస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి విజ్ఞప్తి చేశారు.
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కల్యాణ లక్ష్మి కి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇవ్వడంతో కళ్యాణ లక్ష్మి పథకానికి అదనంగా బడ్జెట్ లో కేటాయించాల్సిన నిధులు పై చర్చించారు.. బీసీ హాస్టల్ లని మరింత అభివృద్ధి చేయాలని… తెలంగాణ బీసీ కుల గణన చేస్తామని హామీ ఇవ్వడంతో దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. పాత జిల్లాలకి బీసీ స్టడీ సర్కిల్ లకి పక్కా భవనాలు ఉండడంతో కొత్త జిల్లాలకి బిల్డింగ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.. సావిత్రి భాయ్ అభ్యుదయ యోజన కింద బాలికల విద్య మరింత ముందుకు తీసుకుపోవాలని అధికారులను ఆదేశించారు.
కుల వృత్తుల్లో చదువుకున్న వారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి స్కిల్ డెవలప్మెంట్ కి శిక్షణ కార్యక్రమాల పై అధ్యయనం చేయాలని సూచించారు.. గీతా వృత్తిదారులకు అదునాతన సేఫ్టీ మోకులు సబ్సిడీతో అందించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండని దానికి అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు..
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..