Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల కోసం ఇద్దరు మంత్రులు ప్రత్యేకంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేదలు, ప్రజల కోసం పనిచేస్తుందని, పాలకుల కోసం, దొరల కోసం పనిచేసేది కాదని ఆయన తేల్చి చెప్పారు.
Samantha : శుభం ప్రీమియర్ టాక్.. కొచం అటు.. కాస్త ఇటు..
రాష్ట్రంలో ప్రస్తుతం 9065 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, తమ ప్రభుత్వం 8 కొత్త కళాశాలలు, వాటి భవనాలను మంజూరు చేసిందని భట్టి విక్రమార్క తెలిపారు. వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. 2014 నుంచి పదేళ్ల పాటు తెలంగాణ కోసమే పట్టించుకున్నామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య విద్య కోసం కేవలం 5950 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. అయితే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి 11482 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. వరంగల్‌లో అడ్డగోలుగా మాట్లాడిన కేసీఆర్‌కు ఈ లెక్కలు తెలియాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను గాలికి వదిలేసిందని, ఆరోగ్యశ్రీని కూడా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 90 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు పేదలను గాలికి వదిలేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. వైద్యంతో పాటు విద్యకు కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, రెసిడెన్షియల్ స్కూల్ బిల్లులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తాము 58 అంతర్జాతీయ స్థాయి పాఠశాలలకు శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు. పేదలకు 22500 కోట్ల రూపాయలతో 4 లక్షలకు పైగా ఇళ్లను అందిస్తున్నామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం పదేళ్లు కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు.
22 వేల కోట్ల రూపాయల రుణ మాఫీని ఒక్కసారే చేశామని, సీతారామ ప్రాజెక్ట్‌ను గాలికి వదిలేస్తే రాజీవ్ కెనాల్ ద్వారా 100 కోట్లు కేటాయించి నీళ్లందించామని ఆయన చెప్పారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న రాజకీయ పార్టీలు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, రూపాయి రూపాయి పోగేసి ప్రజల కోసం ఖర్చు పెడుతున్నామని ఆయన అన్నారు. ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో కమిటీ వేశామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా అభివృద్ధి చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ మాదిరిగా భయపెట్టి పాలన చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని, కుంగిపోయే కాళేశ్వరం వంటి ప్రాజెక్ట్‌ల కోసం వ్యయం చేయలేదని ఆయన అన్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా చేసేది తమ ప్రభుత్వం కాదని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను విస్మరించిందని విమర్శించారు. ఆర్థిక మంత్రి తల తాకట్టు పెట్టి విద్యా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కొన్ని మెడికల్ కళాశాలలను వదిలేసి పోయిందని, మెడికల్ కళాశాలలకు వెయ్యి కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టిందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం మెడికల్ శాఖను గాడిలో పెడుతోందని ఆయన అన్నారు. విద్యా, వైద్యానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఖమ్మంలో మెడికల్ కళాశాల అద్భుతంగా నిర్మాణం జరగబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Guntur Crime: ట్రాంజెండర్‌తో ఎఫైర్..! తప్పు అని చెప్పినందుకు దారుణ హత్య..
