NTV Telugu Site icon

Bhatti Vikramarka Exclusive Interview: భూములు తిరిగి భూస్వాములకు అప్పగించేందుకే ధరణి..!

Bhatti

Bhatti

Bhatti Vikramarka Exclusive Interview: ధరణిలో అనేక భూములను ఎంట్రీ చేయలేదని చేయడం లేదు అని ఆరోపించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తాను చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పేదలు అనుభవిస్తోన్న భూములను కూడా భూస్వాముల భూములుగా చూపిస్తోంది ధరణి అని విమర్శించారు. ఇక, గతంలో దున్నేవాడికి భూమి కావాలంటూ అనేక పోరాటు జరిగాయి.. అలా హక్కులు సంపాదించుకున్న తర్వాత.. ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి.. మీకు హక్కులు లేవంటే ఎలా? అని ప్రశ్నించారు. భూపోరాటాల తర్వాత భూస్వాములు ఎంతోకొంతకు భూములు అమ్ముకొని వెళ్లిపోయారు.. కానీ, ధరణి వచ్చిన తర్వాత.. భూములు అమ్ముకుని అమెరికా, హైదరాబాద్‌ వెళ్లిపోయినవారికి పట్టాలు ఇస్తున్నారు. ఇలా చాలా సైలెంట్‌గా భూములను మళ్లీ భూస్వాములకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: Manchu Manoj: ఆదిపురుష్ కోసం మేము కూడా అంటున్న నవదంపతులు

ఆదిలాబాద్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించా.. ఆదిలాబాద్‌లో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.. మేం ఈ రాష్ట్ర బిడ్డలం కాదా? అని ప్రశ్నిస్తున్నారు అని తెలిపారు భట్టి.. ప్రభుత్వం ఎందుకు మమ్మళ్లి ఇలా ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చాలి.. కానీ, వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదన్నారు.. పోడ భూములకు పట్టాలు లేవు.. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పేరుతో అడవి బిడ్డలను బయటకు పంపుతున్నారు.. గిరిజనేతరులకు ఏమైనా ఉందా? అంటే అది కూడా లేదు.. పోడు భూముల సమస్యలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. మరి.. అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చారా? అని సవాల్‌ చేశారు. గతంలో.. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇస్తూ.. ఇప్పుడు మేమే ఇస్తున్నామని ప్రచారం చేయడం ఏంటి? అంటూ కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు భట్టి విక్రమార్క.

Read Also: RBI Recruitment 2023: డిగ్రీ అర్హతతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..రూ.71,032 జీతం..

పేదలకు పంచిన భూములను ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కుందని మండిపడ్డారు భట్టి విక్రమార్క.. చాలా భూములను ధరణిలో ఎంటర్‌ చేయలేదని ఆరోపించిన ఆయన.. భూస్వాములకు తిరిగి భూములు అప్పగించేందుకు ధరణి తీసుకొచ్చారని ఆరోపించారు.. ధరణి కంటే ముందే రైతులకు మేలు జరిగింది.. రాష్ట్రంలో కేసీఆర్‌ అదనంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టించారా? కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచే నీరు ఇస్తున్నారని తెలిపారు.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments