Manchu Manoj: ఆదిపురుష్ కోసం చిత్ర పరిశ్రమ మొత్తం ఏకమవుతుంది. భాషతో సంబంధం లేకుండా అంతా రాముని కథను ప్రజలకు అందించాలనే సంకల్పంతోనే ముందుకు కొనసాగుతున్నారు. సినిమా రిలీజ్ కాకముందే.. ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు. ఆదిపురుష్ ను ప్రపంచం మొత్తం వీక్షించాలన్న సంకల్పంతో సినీ ప్రముఖులు.. థియేటర్ లో ఈ సినిమాను చూడలేనివారికోసం తమవంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల కోసం నిర్మాత అభిషేక్ అగర్వాల్ పదివేల టికెట్స్ ను బుక్ చేశాడు, ఆ తరువాత రామ్ చరణ్.. ఇక ముంబైలో రణబీర్ కపూర్.. అనన్య బిర్లా.. శ్రేయాస్ మీడియా అధినేతలు.. ఇలా ఒక్కొక్కరిగా అనాథ పిల్లల కోసం, వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ఆదిపురుష్ టికెట్స్ ను బుక్ చేసి వారికి అందిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయాడు మంచు వారబ్బాయి మంచి మనోజ్. ఈ మధ్యనే మనోజ్.. తాను ప్రేమించిన మౌనికను వివాహమాడి కొత్త జీవితాన్నీ మొదలుపెట్టిన మనోజ్.. ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్నాడు.
RGV Den: అది డెన్ లా లేదు.. పోర్న్ హబ్ లా ఉంది.. ఆ నగ్న ఫోటోలు ఎవరివి వర్మ
ఇక కెరీర్ పరంగా మళ్లీ అడుగులు వేస్తున్న ఈ హీరో.. ఆదిపురుష్ కు మేము సైతం అని చెయ్యి కలిపాడు. తమ దంపతుల తరుపున 2,500 మంది పిల్లలకు ఆదిపురుష్ టికెట్స్ ను బుక్ చేస్తున్నట్లు ఆయన అధికారికంగా తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ పిల్లలకు ఈ టికెట్స్ ను అందిస్తున్నట్లు తెలిపాడు. దీంతో మనోజ్ దంపతులపై అభిమానులు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇకపోతే మనోజ్ ప్రస్తుతం వాట్ థ్ ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మనోజ్ హిట్ ట్రాక్ ను ఎక్కుతాడా.? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.