Mega 158 : చిరు – బాబీ సినిమాకు ‘కదిరి కాకాజీ’ టైటిల్ ఫిక్స్ చేసారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన టైటిళ్లు లేదా కథాంశాలు అధికారిక ప్రకటన రాకముందే లీక్ కావడం ఇప్పుడు ఓ మినీ ట్రెడిషన్‌గా మారిపోయింది. గతంలో పలు చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన నటించబోయే 158వ చిత్రం గురించి కూడా నెట్టింట ప్రచారం శరవేగంగా అందుకుంది
మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘కదిరి కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్. అంతేకాకుండా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు నిమిషానికి పైగా నిడివి ఉన్న ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రతి సినిమా అనౌన్స్మెంట్కు ముందే ఇలాంటి టైటిల్ లీకులు బయటకు రావడం మెగా అభిమానులకు ఒకవైపు సరదాగా, ఉత్సాహంగా అనిపిస్తోంది. మెగా స్టార్ బర్త్ డే ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఫ్యాన్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆగస్టు 22న వచ్చే గ్లింప్స్ ఈ ‘కదిరి కాకాజీ’ టైటిల్ ప్రచారానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి!
Also Read
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
- Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?