Electrical tractor: రూ.14 ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం.. ఈ-ట్రాక్టర్ స్పెషల్ ఇదే..!
- త్వరలో రోడ్లపైకి ఈ-ట్రాక్టర్
- AutoNxt స్టార్టప్ కంపెనీ ఫ్లాన్
- రూ.14 ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు మనకు ఎలక్ట్రికల్ కారు.. స్కూటీ, బైక్, ఆటో మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రాక్టర్ కూడా రాబోతుంది. వ్యవసాయ పొలాల్లో డీజిల్ ట్రాక్టర్లే మనకు పరిచయం. కానీ ఈ-ట్రాక్టర్ కూడా త్వరలో రోడ్లపై పరిగెత్తబోతుంది. ఇండియా అంటనే వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయ పొలాలకు ఎక్కువగా ట్రాక్టర్లనే ఉపయోగిస్తుంటారు. అయితే డీజిల్ ట్రాక్టర్లతో ఖర్చు భారంగా అవుతోంది. దీంతో తక్కువ ఖర్చుతో ఈ-ట్రాక్టర్ తయారు చేసేందుకు కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా ట్రాక్టర్ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ నమోనాలు కూడా రెడీ చేశాయి.
AutoNxt స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ టెక్నాలజీపై పని చేస్తోంది. AutoNxt కంపెనీ ఈ ట్రాక్టర్ కోసం లెవల్ 3 అటానమస్ టెక్నాలజీ వాడుతున్నట్లు సీఈవో వెల్లడించారు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ కూడా ఈ కంపెనీలో వచ్చే ఏడాది లోపు వస్తుందని సీఈవో కౌస్తుభ్ ధోండే తెలిపారు. డీజిల్ ట్రాక్టర్ కంటే ఈ ట్రాక్టర్ తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందని ధోండే పేర్కొన్నారు. డీజిల్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు రూ.93 ఖర్చు అయితే.. ఈ ట్రాక్టర్ కేవలం రూ.14లు మాత్రమే ఖర్చు అవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా డీజిల్ ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ల ఇంజన్ పవర్ కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ట్రాక్టర్‌ను కంపెనీ ఛార్జర్‌తో మూడు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని ధోండే చెప్పుకొచ్చారు. 2025 ఆర్థిక సంవర్సరానికి 100 ఈ ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురావాలని AutoNxt కంపెనీ ప్రయత్నిస్తోంది.
Also Read
- Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
- Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
- REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
- HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..