Bhatti Vikramarka : రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా భవన్‌లో బ్యాంకర్స్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లెక్కలు కాదు ఆత్మ ఉండాలి.. 18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చాము, రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్లు మాత్రమే చేరాయి, రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాము. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్న ము. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తాం. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నాం. ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందిస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నాం. ఇది వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయన్నారు భట్టి విక్రమార్క.
Minister Atchannaidu: ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు.. వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అంతేకాకుండా..’వ్యవసాయం తో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుంది. ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నము. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి 36 వేల కోట్ల విలువైన ఎంఓఏలు కుదుర్చుకున్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుంది. వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించండి. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నాం. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి చేయండి. 20 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నాను. మొదటి క్వార్టర్ లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62% వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం. రాష్ట్రం యొక్క నగదు నిల్వలనిష్పత్తి మొదటి క్వార్టర్లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశం. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేలా మా ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. వరి ఉత్పత్తిలో పెరుగుదల ఎఫ్సీఐకి వరిని సరఫరా చేసే రాష్ట్రాల్లో ప్రధాన రాష్ట్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుంది. రాబోయే క్వార్టర్లో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నాను.’ అని భట్టి విక్రమార్క అన్నారు.
Bangladesh: ‘షేక్ హసీనాను ఉరితీయాల్సిందే’.. మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!