Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramakra About Telangana Formation Day

Bhatti Vikramarka : ధరణి ద్వారా దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం

Published Date :June 2, 2023 , 6:53 pm
By Gogikar Sai Krishna
Bhatti Vikramarka : ధరణి ద్వారా దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పీపుల్స్‌ మార్చ్‌ పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. నేడు ఆయన పాదయాత్ర అచ్చంపేట నియోజకవర్గంలో కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి పోరాడిన ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ కలను నెరవేర్చిన సోనియా గాంధీ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డిప్యూటీ స్పీకర్‌గా అసెంబ్లీలో రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టడం, ఆ బిల్లును ఢిల్లీకి పంపించడంలో నా పాత్రను పోషించానని ఆయన వ్యాఖ్యానించారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నం తప్పా, ప్రత్యేక తెలంగాణ లక్ష్యాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం, స్వాతంత్రం, భావ స్వేచ్ఛను బిఆర్ఎస్ పాలనలో పూర్తిగా కోల్పోయామని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, అమ్మ హస్తం పథకం కూడా అందరిని దుస్థితి కేసిఆర్ పాలనలో నెలకొన్నదని, దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి ఆ చట్టాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. మైనార్టీ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు.

TSRTC : వరంగల్ రీజియన్‌లో 132 ఎలక్ట్రిక్ బస్సులు

అంతేకాకుండా.. ‘ దళిత బందుకు రూ. 17,700 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి, ఏడాది పూర్తయిన నిధులు విడుదల చేయకుండా చట్టసభను అవమానించిన వ్యక్తి సీఎం కేసీఆర్. ధనిక రాష్ట్రంలో పింఛన్లు నిత్యవసర సరుకుల కోత, ఇందిరమ్మ ఇండ్ల బంద్ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. అనేక చట్టాల ద్వారా పేదలకు భూములపై హక్కులు రాగ… ధరణి తీసుకువచ్చి ఆ హక్కులను తొలగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి ధరణి ద్వారా పాల్పడుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు, ప్రగతిశీల వాదులు ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు ఏంటి? ఈ పదేండ్ల కాలంలో సాధించిన లక్ష్యాలు ఏంటి? అన్నదానిపై చర్చ జరపాలి.

AP NEWS: జనాల్లోకి జనసేనాని.. వారాహిపై ప్రచారానికి సిద్ధమైన పవన్ కల్యాణ్

సాధించుకున్న తెలంగాణలో లక్ష్యాలు నెరవేరకుండా అడ్డుగా ఉన్నది ఎవరు? ఆ అడ్డుని ఎలా తొలగించుకోవాలో ప్రజలు ఆలోచన చేయాలి. ప్రశ్నిస్తే పోలీసుల నుంచి వేధింపులు, బెదిరింపులు ఉంటాయన్న భయం నుంచి బయటపడాలి. బీఆర్ఎస్ పరిపాలనలో విధ్వంసం అవుతున్న తెలంగాణను కాపాడుకోకుంటే 70 ఏళ్ల క్రితం నాటి ఫ్యుడల్ వ్యవస్థ కింద ప్రజలు నలిగి పోవాల్సి వస్తుంది. భూములను దోపిడీ చేయడానికి క్యాప్టలిస్టులు, ఫ్యూడలిస్టులు తెలంగాణపై దాడి చేస్తుండ్రు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రజల సిద్ధమయ్యారు. అమెరికాకు వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ 100 సీట్లలో గెలుస్తుందని చెప్పడం హాస్యస్పదంగా ఉంది.’ అని భట్టి విక్రమార్క అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • breaking news
  • latest news
  • Telangana Formation Day
  • telugu news

తాజావార్తలు

  • Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

  • Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

  • Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

  • Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions