ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ లో పలువురి చేరికలు జరిగాయి.. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మొదటి సారిగా జిల్లాలో ఒకే వేదిక మీద భట్టి, పొంగులేటి కలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో దొరలు కేంద్రంలో క్యాపిటలిస్టుల రాజ్యం కొనసాగుతుంది.. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మల్లుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Sree Leela: శేఖర్ మాస్టర్ కు సారీ చెబుతూ శ్రీలీలా మూడు పేజీల లేఖ.. ఏమైందో తెలుసా?
కేసీఆర్ మాటలతో తెలంగాణ ప్రజలు ఆగం ఆగం అయ్యారు.. తెలంగాణలో ప్రజలు ఆగం కావద్దని నిర్ణయం చేసుకున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. ఐదు లక్షల కోట్ల అప్పు తెలంగాణలో జరిగింది.. గోదావరి కృష్ణ నుంచి ఒక చుక్క నీళ్లు కూడా తెలంగాణలో పారటం లేదు అని ఆయన అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు వచ్చి చేరుతున్నారు.. నిన్నటి వరకు నీ పక్కనే ఉన్న కమ్యూనిస్టులు కూడా నిన్ను వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నారు.. కేసీఆర్ ని వదిలించుకోకపోతే ప్రమాదమని కమ్యూనిస్టులు గుర్తించారు.. కాంగ్రెస్ వాళ్ళని ప్రయోజనమని కమ్యూనిస్టు గుర్తించారు అని భట్టి తెలిపారు.
తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లోకి రావాలని అనుకుంటున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్లోకి వలసలకి కారణం రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్ కారణం.. కేసీఆర్ ని నమ్మవద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.. మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ చేసినట్లేనని ఆయన చెప్పారు. బుద్ధి ఉందా ఈ ముఖ్యమంత్రికి.. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సంపద పెరిగింది.. పెరిగిన సంపదతో తెలంగాణని కేసీఆర్ కుటుంబానికి ఇస్తే తెలంగాణ సంపదని కేసీఆర్ కుటుంబం మింగేస్తుంది.. రాష్ట్రంలో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షలు ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు.
Read Also: China: చైనా వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై కొవిడ్ టెస్టులు అక్కర్లే..
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ నేతల కను సైగల్లో బీఆర్ ఎస్ పార్టీ నడుస్తోంది.. బీజేపీతో సంబంధాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకీ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎస్పీలు ఐజీలు వచ్చి హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికారు అని పొంగులేటి అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ల మిలాఖత్ ను యావత్ తెలంగాణ ప్రజల గమనిస్తున్నారు.. రాబోయే రోజులు మన రోజులు ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.. నాలుగు డిక్లరేషన్లు ఇచ్చాము.. అధికార మదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.